Magazines

కూకట్‌పల్లిలో పగిలిన గ్యాస్ పైప్ లైన్..క్షణాల్లో లీకైన గ్యాస్

1 రోజు క్రితం

Gas Leak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కూకట్‌పల్లి పరిధిలోని బాలాజీ నగర్‌లో ప్రమాదవశాత్తు భూగర్భ గ్యాస్ పైప్ లైన్ పగిలిపోవడంతో తీవ్ర గ్యాస్ లీకేజీ ఏర్పడింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాలాజీ నగర్ వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా, కింద ఉన్న గ్యాస్ పైప్ లైన్‌కు అనుకోకుండా నష్టం వాటిల్లింది. దీంతో పైప్‌లైన్‌ తీవ్రంగా దెబ్బతిని గ్యాస్ వేగంగా బయటకు విడుదలవ్వడం ప్రారంభమైంది. ఒక్కసారిగా గ్యాస్ వాసన దట్టంగా వ్యాపించడంతో సమీప నివాసితులు, వ్యాపారులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ లీకేజీ విషయాన్ని గమనించిన వెంటనే స్థానికులు గ్యాస్ పంపిణీ సంస్థ (భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్) అధికారులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సాంకేతిక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ముందుజాగ్రత్తగా సంబంధిత లైన్‌తో గ్యాస్ సరఫరాను నిలిపివేశాయి. పగిలిన పైప్‌లను అత్యవసర మరమ్మతులు చేపట్టి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. సమయానికి అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్