నవతెలంగాణ - హైదరాబాద్ : యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రంలోని హైఎనర్జీ రెట్రో మాస్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.







కామెంట్‌లు (0)