నవతెలంగాణ - హైదరాబాద్: సామాజిక భద్రత, కార్మిక హక్కులు, సంక్షేమ చర్యలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) రేపు మహా ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు యూనియన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ తెలిపారు. శిల్పకళా వేదిక నుంచి హెచ్‌ఐసీసీ, హైటెక్స్ ప్రాంతం వరకు ర్యాలీ కొనసాగనుంది.
2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ కార్మికులకు రాహుల్‌గాంధీ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన యూనియన్.. తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టం-2026 అమలును మరింత మెరుగుపరచాలని కార్మికులు డిమాండ్ చేయనున్నారు. కార్మికుల నమోదు, సామాజిక భద్రతా ప్రయోజనాలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు.






కామెంట్‌లు (0)