Magazines

ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించండి: వైఎస్‌ జగన్‌

18 అక్టోబర్, 2026

YS JAGAN
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- హైదరాబాద్‌: ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ పునేఠాను కోరామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్టంలో జరుగుతున్న దాడులు, అల్లర్ల దృష్ట్యా ఆదివారం ఆయన ఎస్‌ఈసీని కలిసి పలు ఘటనలపై ఫిర్యాదు చేశారు.


అనంతరం మీడియాతో జగన్‌ మాట్లాడుతూ..‘‘రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వివరించాం. పలు చోట్ల వైకాపా అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కుంటున్నారు. సాయంత్రం గవర్నర్‌ను కూడా కలిసి అన్ని వివరాలు తెలియజేస్తాం. కేంద్ర బలగాలను రప్పించాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశాం. పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల లోపల, బయట లైవ్‌ ప్రసారాలు ఉండాలని కోరాం. 17 సి ఫామ్‌లో సంతకాలు ఫోర్జరీ జరగకుండా చూడాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశాం’’ అని జగన్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్