Magazines

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.1.20 కోట్ల బంగారం స్వాధీనం

05 అక్టోబర్, 2026

Shamshabad Airport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి తిరుచిరాపల్లి నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన బ్యాగులో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్