నవతెలంగాణ – హైదరాబాద్ : వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHC) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు అందించనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పీఏసీఎస్‌లు, మహిళా సంఘాలు ఈ కేంద్రాలను నిర్వహించనున్నాయి. ఎంపికైన సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. యంత్ర పరికరాల మొత్తం వ్యయంలో 40 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు రాయితీ లభించనుంది. దీంతో రైతులకు తక్కువ అద్దెకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి.
రైతులకు శుభవార్త.. వ్యవసాయ యంత్రాలపై 40 శాతం సబ్సిడీ
1 గంట క్రితం

Kalluri Elender
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)