నవతెలంగాణ-హైదరాబాద్ : పీఎం కిసాన్ 24వ విడత నిధులను అక్టోబర్ 30న విడుదల చేయనుంది. దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి రూ.2,000 చొప్పున జమ కానున్నాయి. ఈ స్కీమ్ కింద కేంద్రం రూ.2 వేల చొప్పున ఏడాదికి 3 విడతల్లో మొత్తంగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోన్న విషయం తెలిసిందే. 24వ విడత ద్వారా 9.44 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఈ-కేవైసీ చేసుకున్న రైతులకే ఈ డబ్బులు జమకానున్నాయి.






కామెంట్‌లు (0)