Magazines

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్..

1 గంట క్రితం

Good news for Jio customers..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : మొబైల్‌ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్‌ సౌకర్యం కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో కొత్త వాయిస్‌ ఓన్లీ ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రాయ్‌ ఆదేశాల మేరకు తీసుకొచ్చిన ఈ ప్లాన్లు రూ.147 నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిలో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు లభిస్తాయి.

ప్లాన్ల వివరాలు:

  • రూ.147: 22 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్‌ఎంఎస్‌లు.

  • రూ.177: 28 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్‌ఎంఎస్‌లు.

  • రూ.196: 30 రోజుల వ్యాలిడిటీ.

  • రూ.197: క్యాలెండర్‌ నెల వ్యాలిడిటీ.

  • రూ.448: 84 రోజుల వ్యాలిడిటీ, 1,000 ఎస్‌ఎంఎస్‌లు.

  • రూ.1,748: 336 రోజుల వ్యాలిడిటీ, 3,600 ఎస్‌ఎంఎస్‌లు.

ఈ ప్లాన్లతో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌ సదుపాయాలు కూడా లభిస్తాయి. అయితే మొబైల్‌ డేటా ఉండదు. సెకండరీ సిమ్‌ వినియోగదారులు, వైఫైపై ఆధారపడేవారు, ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించే వారికి ఈ ప్లాన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, వీఐ కూడా వాయిస్‌ ఓన్లీ ప్లాన్లను అందిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్