నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో గ్రాప్ 1 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) ఆంక్షల్ని అమలు చేయాలని ఢిల్లీ పర్యవరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం ప్రజలు వాయు కాలుష్యానికి కారణమయ్యే కొన్ని చర్యల్ని ఆపేయాల్సి ఉంటుంది.
గ్రాప్ 1 ప్రకారం.. ఢిల్లీలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర చోట్లా ఎక్కడా వంట కోసం బొగ్గును వాడకూడదు. డీజిల్ జనరేటర్లను కూడా అత్యవసర పరిస్తితుల్లో తప్ప వాడరాదు. ఆంక్షల్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
ఇప్పటికీ ఢిల్లీలో వాయు కాలుష్య నాణ్యత పూర్ కేటగిరిలో ఉంది. బుధవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 223గా నమోదైంది.
వాయు కాలుష్యం పెరగడం, ప్రజలు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రాప్ 1






కామెంట్‌లు (0)