నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు 'ఎక్స్' వేదికగా ధ్రువీకరించారు.
సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తుండగా ఈ తాజా ఘటన జరిగింది. సోమవారం నాటి ఆపరేషన్‌లో లతీఫ్ సహచరుడైన ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు. నవంబర్ 11న కుల్గాంలోని అఖ్రాన్‌లో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన దాడిలో లతీఫ్, ఉమర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)