నవతెలంగాణ-హైదరాబాద్: పెండ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు దిగాడు.ఆమెకు అసభ్యకరమైన మెసెజ్ లు, ఫోన్ కాల్స్ చేస్తూ వేధించాడు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఫిర్యాదు ప్రకారం, బోడుప్పల్‌కు చెందిన 28 ఏళ్ల సదరు మహిళ తన భర్తకు దూరంగా ఉంటోంది. సుమారు ఏడాది క్రితం పీర్జాదిగూడలోని ఓ బ్యాంకు వద్ద ఆమెకు శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీనివాస్ ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్ళినట్లు సమాచారం.
అయితే, ఆమెకు ఇంకా తన భర్తతో విడాకులు కాలేదని పేర్కొంటూ, ఆమె తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ తిరస్కరణతో ఆగ్రహించిన శ్రీనివాస్, ఆమెకు పదేపదే ఫోన్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని, ఈ వేధింపులను భరించలేక, సదరు మహిళ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది.






కామెంట్‌లు (0)