Magazines

కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్డు మధ్యంతర ఉత్తర్వులు

17 అక్టోబర్, 2026

High Court
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో తెలంగాణలో ఎటువంటి కూల్చివేతలు చేపట్టవద్దని, ఆస్తులను ఖాళీ చేయించే చర్యలకు దిగవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 17 నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి తగిన ఆదేశాలు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వివాదాస్పద ఆస్తుల విషయంలో ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు చట్టప్రకారం నోటీసులు జారీ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్