నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న డీసీఎం లారీని.. తెలంగాణ నుంచి ఏపీ వైపు మట్టి లోడుతో వస్తున్న కంటైనర్ అదుపుతప్పి డివైడర్ దాటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. డీసీఎం లారీపై కంటైనర్ పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను తొలగించి మృతదేహాలను, క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)