నవతెలంగాణ-హైదరాబాద్ : మూత్రపిండాల వ్యాధికి చికిత్స కోసం చేరిన ఓ మహిళ మరుసటిరోజుకల్లా విగతజీవిగా మారగా, ఆమె మృతదేహంపై పలుచోట్ల ఎలుకలు తిన్నట్లుగా గాట్లు ఉండటం పశ్చిమబెంగాల్ రాజధాని నగరంలో కలకలం రేపుతోంది. తూర్పు కోల్‌కతాలోని మణిక్తలా ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఈ ఘోరం జరిగింది. హావ్‌డా జిల్లాలోని ఆందుల్ పట్టణానికి చెందిన అల్పనా డేకు గత ఆరేళ్లుగా మూత్రపిండాల సమస్య ఉంది. గురువారం ఆమె పరిస్థితి విషమించడంతో బంధువులు ఈ ఆసుపత్రిలో చేర్పించారు. మర్నాడు శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లగా.. అల్పనా మృతిచెందినట్లుగా సిబ్బంది తెలిపారు. ఎలుకలు కొరికిన మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైన బంధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీని నియమించిన అధికారులు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు.
ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఘోరం..ఎలుకలు తిన్న మృతదేహం!
11 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)