Magazines

భారత మహిళల జట్టు భారీ స్కోరు

1 రోజు క్రితం

Huge score by the Indian women's team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత భారీ స్కోరు సాధించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (126), దీప్తి శర్మ (106 నాటౌట్‌) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 329 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.


తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 19 పరుగులకే ఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ప్రతీక రావల్‌ (61) అర్ధశతకంతో జట్టును ఆదుకుంది. అనంతరం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఐదో వికెట్‌కు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


హర్మన్‌ప్రీత్‌ 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేయగా, దీప్తి 86 బంతుల్లో 15 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరిద్దరి ధాటికి భారత్‌ 300 పరుగుల మార్కును దాటి భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నోమ్వెలో సిబాండా 2 వికెట్లు తీయగా.. టెండాయ్ మకుషా, మిచెల్ మావుంగా, న్యాషా గ్వాంజురా, ఒలిండర్ చారే తలో వికెట్ పడగొట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్