నవతెలంగాణ-హైదరాబాద్: దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత్ విక్టరీ సాధించింది. 337 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ సత్తా చాటింది. ఒక వికెట్ తేడాతో పాక్ పై యంగ్ ఇండియా విజయం సాధించింది. చివరి బంతి వరకు పోరాడిన మనల్ చౌహాన్(47), మోహిత్ ఉల్వా(49) భారత్ కు విజయాన్ని అందించారు.
తొలుత టాస్ నెగ్గిన పాక్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఉస్మాన్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. అబ్ధుల్(80), యూసఫ్(63) అర్ధ సెంచరీలతో భారీ స్కోర్ కు దోహదం చేశారు. నిర్ణీత 50 ఓవర్లలకు 9 వికెట్లు 336 పరుగుల చేసింది. భారత్ బౌలర్లు కావ్య పటేల్ నాలుగు,చిగురుపాటి వెంకట మూడు వికెట్లు తీయగా, ఆర్జున్ రాజ్ పుత్ ఒక వికెట్ తీశాడు.
ఛేజింగ్ దిగిన ఇండియా.. ఓపెనింగ్ జోడీ లక్ష్య రాజేష్, ఆర్యావీర్ సెహ్వాగ్ అదిరే ఆరంబాన్నించారు. మంచి ఊపులో ఉన్న ఆర్యావీర్ సెహ్వాగ్ (58)ను నికాబ్ షఫీక్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. వీనిత్ (24), యశ్వర్ధన్ చౌహాన్(09), అర్జున్ రాజ్ పుత్(16) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు.
సహచరుల వికెట్లు కోల్పోతున్న సహనంతో పాక్ బౌలర్లలను లక్ష్య రాజేష్ ఎదురుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు స్కోర్ ను 200 పరుగులను దాటించాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ ఈక్రమంలోనే అలీ రజ్వా వేసిన 36 ఓవర్లలో జట్టు కెప్టెన్ లక్ష్య రాజేష్(80) ఔట్ కాగా, తర్వాత బంతికే అన్వయ్ ద్రావిడ్(19) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. వారి నిష్కమణతో యువ జట్టు ఆశలు సన్నగిల్లాయి.. దీంతో పాక్ బౌలర్ల విజృంభణతో భారత్ జట్టు రన్ రేట్ తగ్గిపోయింది.
చివరలో మనల్ చౌహాన్(47), మోహిత్ ఉల్వా(49) ధాటిగా ఆడారు.32 బంతుల్లో 47 పరుగులు మనల్ చేయగా, 26 బంతుల్లో 49 బాదాడు ఉల్వా. ఇరువురు పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరు కలిసి 35 బంతుల్లో 57 పరుగులు రాబట్టారు. కానీ మనల్ చౌహాన్ ఔట్ కాగా, మోహిత్ ఉల్వా టీమిండియాను గెలిపించాడు.







కామెంట్లు (0)