Magazines

సముద్ర దొంగలపై భారత నేవీ మెరుపు దాడి.. 20 మంది సురక్షితం

1 గంట క్రితం

Indian Navy strikes pirates, 20 people safe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అరేబియా సముద్రంలో సముద్ర దొంగల చెరలో చిక్కుకున్న ఇరాన్‌ మత్స్యకారుల పడవను భారత నౌకాదళం సురక్షితంగా విడిపించింది. భారత నేవీ, వైమానిక దళం సంయుక్తంగా 48 గంటలపాటు నిర్వహించిన ఆపరేషన్‌లో 20 మంది సిబ్బందిని ఎలాంటి ప్రాణనష్టం లేకుండా రక్షించాయి. అక్టోబర్‌ 29న ‘అజిని’ అనే ఇరాన్‌ ఫిషింగ్‌ నౌకను సోమాలియా సముద్ర దొంగలు హైజాక్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన భారత నేవీ.. ముంబయికి సుమారు 3 వేల కిలోమీటర్ల దూరంలో నౌకను గుర్తించి అడ్డుకుంది. వైమానిక దళం సహకారంతో సముద్ర దొంగల నుంచి పడవను స్వాధీనం చేసుకుంది. నవంబర్‌ 2న ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది.


ఈ ఆపరేషన్‌పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. భారత నేవీ సామర్థ్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో భద్రతకు భారత్‌ తన సహకారాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. కాగా, సముద్ర దొంగల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం ఆ ప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్