Magazines

జైస్వాల్‌కు అన్యాయం చేశారు: అశ్విన్‌

17 అక్టోబర్, 2026

Injustice was done to Jaiswal: Ashwin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలక్టర్ల నిర్ణయం దురదృష్టకరమని తన యూట్యూబ్‌ ఛానల్‌లో వ్యాఖ్యానించారు. శుభ్‌మన్‌ గిల్‌ వంటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినప్పుడు జైస్వాల్‌కు అవకాశం కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు. జైస్వాల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో తగినన్ని అవకాశాలు రాకపోవడం అతడి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతోందని అశ్విన్‌ అన్నారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూడటం సెలక్టర్లు, జట్టు యాజమాన్యం బాధ్యతని పేర్కొన్నారు. కనీసం రెండు వన్డేల్లోనైనా ఆడే అవకాశం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Injustice was done to Jaiswal: Ashwin

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్