నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్న పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల ప్రిన్సిపాళ్ల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 13 వరకు ఫీజు చెల్లించవచ్చు. అనంతరం రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 14 నుంచి 20 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. ఆలస్య రుసుము మొత్తాన్ని నవంబర్ 21లోపు బోర్డు ఖాతాలో జమ చేయాలని కళాశాలలకు సూచించింది.
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు..
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)