నవతెలంగాణ-హైదరాబాద్ : జనగామ పట్టణ కేంద్రానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జనగామ కలెక్టరేట్ సమీపంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులు ఉరేసుకున్న తమ కూతురిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
25 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)