నవతెలంగాణ-హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ వేడుకలు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పండుగ ఐక్యతను చాటిందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి, 2017 నుండి నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ మహిళలకు చీరల పంపిణీ ద్వారా పండుగ కానుక అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.






కామెంట్‌లు (0)