నవతెలంగాణ - హైదరాబాద్: బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి నేనున్నానంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని నరసింహులగూడెంకి చెందిన కర్నె ఆదినారాయణ-అనితల కుమారుడు వినయ్ (13) ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి చొరవతో శనివారం కేటీఆర్‌ను కలిశాడు.
ఈ క్రమంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తలిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వినయ్‌ను ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించడంలో ఆయన చొరవ తీసుకున్నారు. అనంతరం తమ కుమారుడి వైద్యానికి అండగా నిలిచిన కేటీఆర్‌కు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.







కామెంట్‌లు (0)