నవతెలంగాణ - హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసేందుకు ఆల్వాల్‌కు చెందిన సాయినాథ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు సమీప బంధువు విశ్వనాథ్ కుటుంబంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. ఈ క్రమంలో విశ్వనాథ్ (41), సరాక్షి (6)ను తీసుకుని రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరాక్షి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. విశ్వనాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






కామెంట్‌లు (0)