నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)