Magazines

బీహార్‌ జ్యువెలర్స్ షోరూమ్‌లో భారీ చోరీ

25 నిమిషాల క్రితం

Major theft at a jewellery showroom in Bihar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జ్యువెలర్స్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. సెన్కో జ్యువెలర్స్ షోరూమ్‌లో దొంగలు పట్టపగలు కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడ్డారు.


ఎనిమిది మంది దొంగలు మూడు మోటార్‌సైకిళ్లపై వచ్చారు. షోరూమ్‌లోకి ప్రవేశించిన తర్వాత, వారు ఆయుధాలతో అక్కడున్న సిబ్బందిని, ఇతరులను తమ అదుపులోకి తీసుకున్నారు. అందరి చేతులను కట్టేసి, వారి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ ప్రతిఘటించకుండా అందరినీ ఒకే చోట చేర్చారు. ఆ తర్వాత షాప్ లో ఉన్న నగలు, ఆభరణాలను తీసుకెళ్లారు.


షాపు ఓనర్ ఫిర్యాదుతో DIG హరికిశోర్ రాయ్, SP కుమార్ గౌతమ్, DSP అజిత్ కుమార్ లు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, సిబ్బందిని విచారించారు. దుండగులు 30 నుండి 40 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను దోచుకున్నారని సమాచారం.

Major theft at a jewellery showroom in Bihar

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్