నవతెలంగాణ - హైదరాబాద్ : వనాటు సముద్ర జలాల్లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైంది. సోలా పట్టణానికి పశ్చిమ దిశలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటనలో జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
24 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)