నవతెలంగాణ - హైదరాబాద్: దీపావళి టపాసుల కారణంగా ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంత్‌నగర్‌లోని ఉషాకిరణ్ సీహెచ్‌ఎస్ అపార్ట్‌మెంట్‌లో దీపావళికి ముందే టపాసులు కాలుస్తుండగా ఓ రాకెట్ భవనంలోని 23వ అంతస్తులో పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీపావళి రాకెట్‌తో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)