నవతెలంగాణ-హైదరాబాద్: నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం (Ramleela Maidaan) లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ను నిరసిస్తూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని వాయిదావేసే ప్రసక్తేలేదని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ పోరాట లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహరించిన తీరుపై కూడా ఖర్గే విమర్శలు చేశారు. ఓటర్ల హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ ఈ అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు తమకు మద్దతుగా ఉన్నాయని వెల్లడించారు.
నవంబర్ 1న భారీ నిరసన ర్యాలీ: మల్లికార్జున ఖర్గే
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)