నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరులో మెట్రో 'పింక్ లైన్' (Pink Line)ను పీఎం మోడీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర ప్రముఖులతో కలిసి తవరేకెరె (Tavarekere) నుండి ఐఐఎం బెంగళూరు (IIM Bangalore) మెట్రో స్టేషన్ వరకు కొత్తగా ప్రారంభించిన 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆయన ప్రయాణించారు. ఈ పింక్ లైన్‌ను సుమారు రూ. 3,470 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీని ప్రారంభం బెంగళూరు మెట్రో నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ. 15,600 కోట్లకు పైగా విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.







కామెంట్‌లు (0)