Magazines

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్లు డౌన్

4 గంటల క్రితం

Microsoft servers down worldwide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సేవల్లో శుక్రవారం కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ 365, అవుట్‌లుక్‌, టీమ్స్‌ సహా పలు అప్లికేషన్లు పనిచేయక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యతో ఈమెయిల్స్‌ యాక్సెస్‌ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు మెయిల్‌ డెలివరీ ఆలస్యమైంది. తెల్లవారుజామున లక్షకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది.


ప్రభావిత సర్వర్లలో సురక్షిత కనెక్షన్ల ఏర్పాటు ప్రక్రియలో అధిక భారం ఏర్పడటమే అంతరాయానికి కారణమని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ సమస్య ప్రభావం ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ ఏఐ సేవలపైనా పడింది. మైక్రోసాఫ్ట్‌ 365 కనెక్టర్లలో సమస్య కారణంగా కొత్త కనెక్షన్లకు ఆటంకం ఏర్పడినట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్