Magazines

ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం

1 గంట క్రితం

MLA Vemula Veeresan's near miss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నల్గొండ: ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం నకిరేకల్‌ నుంచి చిట్యాల మండలం చినకాపర్తి గ్రామానికి ఎమ్మెల్యే తన వాహనంలో వెళ్తుండగా.. కట్టంగూర్‌ మండలం చెర్వు అన్నారం స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు దెబ్బతిన్నది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్