నవతెలంగాణ-హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మొబైల్ రీఛార్జ్ భారం కూడా పడే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి టెలికాం టారిఫ్‌లు 15 శాతం వరకు పెరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా, వచ్చే పదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి మొబైల్ సేవల ధరలు 12 శాతం చొప్పున పెరిగే అవకాశముందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, టెలికాం కంపెనీలు అధికారికంగా ప్రకటించే వరకు ధరల పెంపు ఖరారైనట్లు కాదు. ధరలు పెరిగితే సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది.
భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు..
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)