Magazines

ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు మరో తీపికబురు

1 గంట క్రితం

More good news for female RTC passengers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ మరో తీపికబురు అందించింది. ఇప్పటికే ‘మహాలక్ష్మి’ పథకం కింద పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంస్థ.. తాజాగా ఏసీ బస్సుల్లోనూ రాయితీ ప్రకటించింది. మంత్లీ బస్‌ పాస్‌ తీసుకునే మహిళలు ఇకపై 15 రోజుల ఛార్జీ చెల్లిస్తే.. నెలరోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. దీంతో ఏసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే మహిళలకు ఆర్థిక భారం తగ్గనుంది. సాధారణ బస్సులతో పాటు ఏసీ సర్వీసుల్లోనూ రాయితీ అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలగనుంది. రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉండనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్