నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఆహ్వానం అందుకున్న నార్వే జర్నలిస్టు హెల్లే లింగ్ స్వెండ్సెన్‌కు చివరి నిమిషంలో వీసా రద్దయింది. మీడియా భవిష్యత్తు, పత్రికా స్వేచ్ఛపై నిర్వహించనున్న చర్చల్లో ఆమె ప్యానెలిస్ట్‌గా పాల్గొనాల్సి ఉంది. తొలుత వీసా మంజూరైనప్పటికీ, సమ్మిట్‌కు బయలుదేరాల్సిన రోజే భారత రాయబార కార్యాలయం దానిని రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తనకు సమాచారం అందిందని ఆమె పేర్కొన్నారు. గతంలో ఓస్లోలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన తర్వాతే తన వీసా రద్దయిందని హెల్లే ఆరోపించారు. అయితే వీసా రద్దుకు సంబంధించి అధికారిక కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
నార్వే జర్నలిస్టు వీసా రద్దు..
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)