Magazines

ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

8 నిమిషాల క్రితం

Deadline extended for Graduate MLC voter registration
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 27 తుది గడువు. డిసెంబర్‌ 2న పోలింగ్‌ నిర్వహించి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్