నవతెలంగాణ – హైదరాబాద్: దీపావళి పండుగ వేళ ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తుండగా, హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.65 పలుకుతోంది. వర్షాభావ పరిస్థితులతో మార్కెట్లకు సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కిలో ఉల్లి ధర రూ.100 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ధరల నియంత్రణకు ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తోంది.
దీపావళి వేళ ఉల్లి ధరలకు రెక్కలు..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)