Magazines

తెలంగాణలో ఉల్లి ధరలకు రెక్కలు..

2 గంటల క్రితం

Onion prices soar in Telangana..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో ఉల్లి ధరలు భారీగా పెరిగి సామాన్యుల బడ్జెట్‌పై భారం మోపుతున్నాయి. రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సరఫరా తగ్గడం, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కొత్త పంట మార్కెట్‌కు వచ్చే వరకు ధరలు తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో మరికొంతకాలం అధిక ధరలు కొనసాగవచ్చని భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్