నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞాన్‌శ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసులు ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ స్థానంలో రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌ను నిరసన స్థలాలుగా గుర్తించారు.
తాజాగా ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నిరసనలకు అనువైన స్థలం కాదంటూ గతంలో రాంలీలా మైదాన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా గుర్తించిన నిరసన స్థలాలు ఢిల్లీ చెత్త డంపింగ్ యార్డులకు సమీపంలో ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో నిరసనలపై దాఖలైన పెండింగ్ పిటిషన్‌లో భాగంగా సుప్రీంకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా వాదనలు వినిపించే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)