Magazines

ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ

15 అక్టోబర్, 2026

games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు-2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు ప్రధాని. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత యువత తమ ప్రతిభను నిరూపించుకుంటోందని పీఎం అన్నారు. భారత క్రీడాకారుల ప్రదర్శన దేశంలో మారుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనమని మోడీ వ్యాఖ్యానించారు. ఈ విజయాల వెనుక క్రీడాకారులతో పాటు వారి కోచ్‌లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యుల కృషి కూడా ఉందని అన్నారు.


ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలు సాధించింది. వీటిలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ప్రస్తావిస్తూ ఆయనకు నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్