Magazines

సామాన్యుడిపై ధరల భారం.. పాల నుంచి పప్పుల వరకు పెరుగుదల

1 గంట క్రితం

Price burden on the common man.. increase from milk to pulses
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. అమూల్‌, మదర్‌ డెయిరీ పాల ధరలను పెంచగా.. నెయ్యి, వెన్న ధరలూ అధికమయ్యాయి. హిందుస్థాన్‌ యూనిలివర్‌ సంస్థ సర్ఫ్‌ ఎక్సెల్‌, రిన్‌, వీల్‌ డిటర్జెంట్లతో పాటు మోతీ సబ్బు ధరలను పెంచింది. డాబర్‌ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. మరోవైపు ఐటీసీ గోల్డ్‌ ఫ్లేక్‌ ప్రీమియం సిగరెట్‌ ప్యాక్‌పై రూ.10 పెంచింది. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రెండు నెలల్లో రూ.72.50 పెరిగింది. డ్రై ఫ్రూట్స్‌, కందిపప్పు, శనగల ధరలు సైతం ఎగబాకుతున్నాయి. ఇలా పాలు, గ్యాస్‌, నిత్యావసర సరుకులు, గృహోపకరణాల ధరలు పెరుగుతుండటంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్