నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. డీలిమిటేషన్ కోసం వేచి చూడకుండా, సభలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యతోనే ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం స్పష్టం చేశారు.
“మీరు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ను ఇప్పుడే అమలు చేయవచ్చు. సభలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను లేదా ప్రస్తుత డీలిమిటేషన్‌ను బట్టి, మీరు ఆ సీట్లలో మూడో వంతును సులభంగా కేటాయించవచ్చు. మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి?” అని ఖర్గే ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రభుత్వం ఈ అంశాన్ని వాడుకుంటోందని, గతంలో కాంగ్రెస్ ఈ చట్టానికి మద్దతు ఇచ్చిందని ఖర్గే ఆరోపించారు.







కామెంట్‌లు (0)