Magazines

నీరు వృధా.. పబ్‌కు రూ.20వేల జరిమానా

18 అక్టోబర్, 2026

wasting water
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టే దిశగా జలమండలి కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఉన్న 'ఫోర్ ఫాదర్స్ పబ్' తాగునీటిని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నట్లు జలమండలికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన విజిలెన్స్ అధికారులు, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు.


పబ్‌లో నీటిని వృథా చేస్తున్నట్లు తనిఖీల్లో నిర్ధారణ కావడంతో, యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు.
అంతటితో ఆగకుండా, ఆ పబ్ తాగునీటి కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగించారు. అంతేకాక, జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి కమర్షియల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


ఎక్కడైనా తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే, ఫొటోలు లేదా వీడియోలతో సహా పూర్తి వివరాలను వాట్సాప్ నంబర్ 99499 30003కు పంపాలని జలమండలి సూచించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్