నవతెలంగాణ - హైదరాబాద్ : అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై చైన్‌సాతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో మెరుగైన చికిత్స కోసం శుక్రవారం రాత్రి అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత 13 రోజులుగా అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న హేమంత్‌కు నిర్వహించిన సీటీ స్కాన్‌లో పల్మనరీ ఎంబాలిజం సమస్య గుర్తించారు. అధునాతన వైద్య సదుపాయాలు అవసరమని వైద్యులు కోర్టుకు నివేదించారు. కోర్టు అనుమతితో సుమారు 10 మంది సిబ్బంది భద్రత మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
రాప్తాడు దాడి.. నిందితుడు హేమంత్ ఆరోగ్యం విషమం
3 గంటల క్రితం

Kalluri Elender
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)