నవతెలంగాణ - హైదరాబాద్ : అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్లో అఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం షార్జాలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓపెనర్ తడివానషే మరుమనిని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 120 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ 200 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 171 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (116) అద్భుత శతకంతో అఫ్ఘానిస్థాన్ 221 పరుగులు చేసింది. కెప్టెన్ రషీద్ ఖాన్ 6 బంతుల్లో 4 సిక్సర్లతో 25 పరుగులు సాధించాడు. అనంతరం జింబాబ్వే 202 పరుగులకే పరిమితం కావడంతో అఫ్ఘానిస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రషీద్ ఖాన్ అరుదైన ఘనత..టీ20ల్లో 200 వికెట్లు!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)