Magazines

ఆ వీడియో క్లిప్‌ను తిరిగి అప్‌లోడ్‌ చేయండి: బాంబే హైకోర్టు

1 గంట క్రితం

Re-upload that video clip: Bombay High Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పర్యావరణ అనుకూల, బాణసంచా రహిత దీపావళి ప్రచారం కోసం నటి దియా మీర్జాతో బృహన్‌ ముంబయి కార్పోరేషన్‌ (బీఎంసీ) రూపొందించిన వీడియో చుట్టూ నెలకొన్న వివాదంపై బాంబే హైకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ వీడియో క్లిప్‌ను తిరిగి అప్‌లోడ్‌ చేయాలని జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్‌ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం బీఎంసీని ఆదేశించింది.


బీఎంసీ వెబ్‌సైట్‌ నుండి వీడియోను తొలగించిన విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన ధర్మాసనం కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వారి "సంకుచిత మనస్తత్వం" పట్ల తాము తీవ్రంగా కలత చెందామని పేర్కొంది. పర్యావరణం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వీడియోకు ఇటువంటి రంగు పులమడం "చాలా దురదృష్టకరమని" పేర్కొంది. ఆ సెలబ్రిటీనే ఎందుకు ఎంచుకున్నారో ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.


పర్యావరణ రహిత దీపావళి జరుపుకోవాలని సూచిస్తూ బీఎంసీ దిమా మీర్జాతో రూపొందించిన ప్రచార వీడియోపై బిజెపి రాజకీయ వివాదాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. ముంబయి బిజెపి చీఫ్‌ అమీత్ సతం అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ రితు తవ్డే ఆమెను "హిందూ వ్యతిరేకి" అని వ్యాఖ్యానించారు. దీంతో బిఎంసి సోషల్ మీడియా నుండి ఆమెకు సంబంధించిన క్లిప్‌ను ప్రత్యేకంగా తొలగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

వదిలిపెట్టవద్దు

సిఫార్సు చేయబడింది

హోమ్