Magazines

రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్..ఐదుగురు మృతి

17 అక్టోబర్, 2026

5 dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : గుజరాత్‌లోని భరూచ్ జిల్లా సైఖా జీఐడీసీ పరిధిలో ఉన్న 'సిన్‌జీల్ ఫార్మాకెమ్' రసాయన పరిశ్రమలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. రాత్రి 10 గంటల సమయంలో హైడ్రోజనేషన్ ప్రక్రియ జరుగుతుండగా రియాక్టర్ పేలడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మిథిలీన్ డిక్లోరైడ్ వాయువు లీకైనట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఆమోద్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్