Magazines

మహారాష్ట్ర సీఎంతో నేడు రేవంత్‌రెడ్డి భేటీ

12 గంటల క్రితం

Revanth Reddy to meet Maharashtra CM today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కీలక చర్చలు జరపనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్‌ ఎత్తును 152 మీటర్లకు పెంచే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తు వద్ద నీటిని తరలించడం కష్టమవుతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. 152 మీటర్ల ఎత్తుతో గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముంబైకి చేరుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్