Magazines

డబుల్‌ డ్యూటీ సిబ్బందికి ఆర్టీసీ కొత్త నిబంధనలు

16 అక్టోబర్, 2026

RTC new rules for double duty staff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నెల 13న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇకపై డబుల్ డ్యూటీ చేసే సిబ్బందికి డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలి, సెలవులకు సంబంధించిన డీఆఫ్, సీఎఫ్‌లను మంజూరు చేయకూడదని పేర్కొంది. డబుల్ డ్యూటీకి బదులుగా సెలవులు ఇవ్వడంతో షెడ్యూల్ సర్వీసుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆర్టీసీ పేర్కొంది. ఈ ఆదేశాలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్