నవతెలంగాణ-హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి వేదికగా రష్యా-ఉక్రెయిన్ అధికారుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో, ఖైదీల మార్పిడిపై రెండు దేశాలకు ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో ఇరు దేశాలు ఖైదీల మార్పిడి చేసుకోనున్నారు. అయితే, దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే విషయంలో మాత్రం ఎటువంటి పురోగతి లభించలేదు.
రష్యా తరపు ప్రధాన ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ మాట్లాడుతూ, ఇరు పక్షాలు భారీ స్థాయిలో ఖైదీల మార్పిడికి అంగీకరించాయని, అలాగే కొన్ని అంశాలపై పరస్పర అవగాహన కుదిరిందని తెలిపారు.
ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన చర్చల అనంతరం, మార్చిలో ఉక్రెయిన్-రష్యా చెరో 200 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. గత సంవత్సరం, యూఏఈ మధ్యవర్తిత్వం తర్వాత ఇరు దేశాలు చెరో 146 మంది ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. మే నుండి జూలై వరకు టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన మూడో విడతల చర్చల అనంతరం పెద్ద ఎత్తున ఖైదీల మార్పిడి జరిగింది.







కామెంట్లు (0)