Magazines

అమెరికాలోని పాఠశాలలో కాల్పులు..ఐదుగురు మృతి

16 అక్టోబర్, 2026

Shooting at a school in America... Five dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రంలోని బెండ్‌ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో గురువారం 16 ఏళ్ల దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు, ఓ ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఈ క్రమంలో ఆ దుండగుడిని స్థానికుడు ఒకరు కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఓ బాలుడు, ఓ ఉపాధ్యాయుడితో సహా మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. అయితే కాల్పులకు దారితీసిన పరిస్థితులు, బాధితుల గుర్తింపు, దాడి వెనక ఉద్దేశ్యంపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్